గిరిజన సంక్షేమంపై సీఎంకు ఎమ్మెల్యేల వినతి

1098చూసినవారు
గిరిజన సంక్షేమంపై సీఎంకు ఎమ్మెల్యేల వినతి
TG: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా, పెండింగ్‌లో ఉన్న అర్హులైన గిరిజనుల పోడు భూములకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని, 'ఇందిర గిరి జల వికాసం' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని, ఐటీడీఏలను బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్