ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు: సీఎం రేవంత్‌

21చూసినవారు
ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు: సీఎం రేవంత్‌
TG: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి, సోషల్ మీడియా వారియర్లుగా మారి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను విస్మరించి ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు జమీందార్లలా ప్రవర్తిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణి మార్చుకుని అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని హెచ్చరించారు. తాను నెలలో 3రోజులు క్షేత్రస్థాయి కార్యకర్తలను కలుస్తానని, మంత్రులు, MLAలు వారంలో ఒకరోజు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో పర్యటించి క్యాడర్‌ను కలవాలని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో జరిగిన PAC సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్