మహబూబ్నగర్-RR-HYD, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం (ఈసీ)
నోటిఫికేషన్ జారీ చేయనుంది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. పాత ఓటర్లు కూడా ఫారం-18 నింపాలి. ఈసీ వెబ్సైట్ (https://ceotelangana.nic.in)లో ఫారాన్ని సమర్పించవచ్చు. నవంబర్ 6 లోపు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. నవంబర్ 25న డ్రాఫ్ట్, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.