ప్రత్యేక తెలంగాణ కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని CM రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సిరిసిల్లలో పద్మశాలీలకు గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆ వర్గం గౌరవించే బాపూజీ కుటుంబానికి ఈ అవకాశం కల్పించేందుకు సీఎం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.