TG: అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన నిబంధనలతో నిజమైన చేనేత కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, వృద్ధాప్యంలో వారికి అందాల్సిన ఆసరా దక్కకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం
జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు పొందిన కార్మికులనే లబ్ధిదారులుగా పరిగణిస్తుండటం సరికాదని పేర్కొన్నారు.