మొబైల్ యూజర్లకు శుభవార్త. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్
ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజుల నుంచి 30 రోజులకు పెరగనుంది.
జియో, ఎయిర్టెల్, వీఐ వంటి టెలికం సంస్థలన్నీ OCT 22 నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ మార్పుతో వినియోగదారులు ఏడాదికి 13 సార్లు కాకుండా 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్యాక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.