ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ప్రధాని
మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య చర్చలు ముగిశాయి.
భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌ను త్వరగా అమలు చేయాలని ఇరు దేశాల నాయకులు పిలుపునిచ్చారు. SME, ఏవియేషన్, రైల్వే రంగాల్లో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో సహకారం కోసం సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. ప్రధాని మోదీతో దిగిన సెల్ఫీని, 'ధురంధర్' BGMతో ఆయనకు స్వాగతం పలికిన వీడియోను మాక్రాన్ 'X'లో పోస్ట్ చేశారు.