ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ అబద్ధం చెబుతున్నాడని ప్రధాని మోదీ ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. తన మొత్తం ప్రసంగంలో, ఒక్కసారి కూడా చైనా గురించి ప్రస్తావించలేదు. చైనా పాకిస్థాన్‌కు అన్ని విధాలుగా సహాయం చేసిందని దేశమంతటికీ తెలుసు, కానీ ప్రధాని, రక్షణ మంత్రి తమ ప్రసంగాలలో ఎక్కడా చైనా పేరు ప్రస్తావించలేదు’ అని రాహుల్ అన్నారు.