
సీఎం నితీష్ కుమార్ చర్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను తొలగించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనను సమర్థిస్తూ యూపీ మంత్రి సంజయ్ నిషాద్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోశాయి. నితీష్ కుమార్ చర్యను వెనకేసుకొస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మంత్రి నిషాద్ తన వ్యాఖ్యలను కేవలం స్థానిక భోజ్‌పురి యాసలో క్యాజువల్‌గా అన్నానని, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని వివరణ ఇచ్చుకున్నారు.




