ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారతదేశాన్ని ప్రభావితం చేయలేదని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో దేశానికి అజేయమైన రక్షణ గోడ ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ దశాబ్దం భారత్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌కు తీసుకురావాలన్న ప్రధాని దార్శనికతకు రిలయన్స్ మద్దతు ఇస్తుందన్నారు.