ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు.. క్లారిటీ ఇచ్చిన APSRTC
May 17, 2026, 16:05 IST/

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు.. క్లారిటీ ఇచ్చిన APSRTC

May 17, 2026, 16:05 IST
APSRTCలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై నెలకొన్న అపోహలపై యాజమాన్యం స్పష్టతనిచ్చింది. సంస్థ ప్రైవేటీకరణ అవుతుందనే ప్రచారాలను ఖండించిన అధికారులు, విద్యుత్ బస్సులు కేవలం మెరుగైన సేవలందించడానికేనని, ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-బస్ సేవా’ పథకం కింద 1,050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వీటిలో 750 బస్సులు మొదటి దశలో ప్రధాన నగరాల్లో ప్రవేశపెట్టబడతాయి. పర్యావరణహిత రవాణా, కాలుష్య నియంత్రణ, డీజిల్ ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా ఈ బస్సులు నడపబడతాయి.