
ఏకధాటిగా 30 గంటలు బతుకమ్మ ఆడిన మహిళలు
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఇరువర్గాల మహిళలు 30 గంటల పాటు ఏకధాటిగా బతుకుమ్మ ఆడారు. వేర్వేరుగా బతుకమ్మ ఆడడం మొదలుపెట్టిన వీరు మీరే ముందు బతుకమ్మను ఎత్తాలంటే మీరే ముందు ఎత్తాలంటూ పోటాపోటీకి దిగారు. సోమవారం సాయంత్రం మొదలైన బతుకమ్మ ఆట మంగళవారం అర్ధరాత్రి 11:30 వరకు కొనసాగింది. పోలీసులు వచ్చి ఎంత సేపైనా ఆడుకోండి కానీ గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి వెళ్లిపోయారు. చివరికి ఒకే సమయంలో రెండు బతుకమ్మలు ఎత్తి ఆట ముగించారు.




