
మరో నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు: APSDMA
AP: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. రేపు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.




