నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మంత్రి పొన్నం

12చూసినవారు
TG: స్వాతంత్య్ర ఉద్యమం గురించి ఏమాత్రం తెలియని ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధాని నెహ్రూపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మోదీ చరిత్ర తెలుసుకోవాలని, గాంధీ, ఇందిరల పట్ల ద్వేషం పెంచుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాగే మాట్లాడితే దేశ ప్రజలు క్షమించరని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు.
Job Suitcase

Jobs near you