
భూవివాదం.. కత్తులతో దాడులు!
నెల్లూరు జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కలిగిరి మండలంలోని వేపివాపి గ్రామంలో భూవివాదం కారణంగా అన్నమ్మ, సుధీర్ అనేవారిపై శేషయ్య, నవీన్, బాలాజీ అనే వ్యక్తులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




