ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మోదీ చిత్రాలను మగ్గంపై నేసి అద్భుతంగా రూపొందించారు. ముఖ్యంగా, ప్రధాని మోదీ తన తల్లితో కలిసి ఉన్న చిత్రం, యోగా ముద్రలో కూర్చున్నట్టుగా ఉన్న మరో చిత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రధానికి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలన్న ఉద్దేశంతో, 20 రోజులపాటు శ్రమించి ఈ చిత్రాలను రూపొందించినట్లు హరిప్రసాద్ తెలిపారు.