
‘అఖండ 2’ ఫ్యాన్ సీన్ పై బోయపాటి వివరణ
‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో తలతో దిష్టి తీసే సీన్, హెలికాప్టర్ ఫ్యాన్‌ను త్రిశూలంతో తిప్పే సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ను, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తిప్పుతున్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన దర్శకుడు బోయపాటి శ్రీను, తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, ఎవరినీ విమర్శించాలనే ఆలోచన తమకు లేదని, కేవలం కథనానికి అనువుగా ఫ్యాన్ రెక్కలను వాడామని తెలిపారు.




