
అమెరికాలో సంచలనం రేపుతున్న ఎప్స్టీన్ ఫైళ్లలో ఎలాన్ మస్క్ పేరు
అమెరికాలో సంచలనం రేపుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరు బయటపడింది. ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లను యూఎస్ ప్రభుత్వం విడుదల చేయగా, 2014 డిసెంబరు 6న మస్క్ ఎప్స్టీన్ ప్రైవేటు ద్వీపాన్ని సందర్శించినట్లు పత్రాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను మస్క్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చకు దారితీస్తోంది.




