టీమిండియా ప్లేయర్ మోహిత్ శర్మ క్రికెట్‌ను వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2015లో చివరిసారిగా అతను టీమిండియా తరఫున ఆడారు. 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మోహిత్ శర్మ సీఎస్‌కే, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.