
ప్రేమ జంటకు సజీవంగా నిప్పుపెట్టారు(వీడియో)
రాజస్థాన్లోని జైపూర్ మోఖంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భరోలావ్ గ్రామంలో ఓ ప్రేమ జంటను కట్టేసి కుటుంబ సభ్యులు చితకబాదారు. అనతరం సజీవంగా ఇద్దరికి నిప్పుపెట్టారు. వెంటనే గమనించిన స్థానికులు మంటల్లో కాలిపోయిన ప్రేమికులను జైపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




