డబ్బులు ఎవరికీ ఊరికే రావు : సీపీ సజ్జనార్

10672చూసినవారు
డబ్బులు ఎవరికీ ఊరికే రావు : సీపీ సజ్జనార్
TG: హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదివారం సైబర్ క్రైమ్ నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బులు ఎవరికీ ఊరికే రావని, పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతిరోజూ కోట్లాది రూపాయల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని, డబుల్, త్రిపుల్ ఇన్ కమ్ వస్తుందన్న మాయ మాటలు నమ్మి ఆన్ లైన్ యాప్స్ లో డబ్బు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్