ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు

19చూసినవారు
ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
TG: యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వరి ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో వరి సాగు భారీగా పెరిగింది. ప్రస్తుతం కొన్ని చోట్ల పంట కోతకు వచ్చింది. మరికొన్ని చోట్ల పొట్టదశలో ఉంది. ఇక తర్వలోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. దీంతో ధాన్యం డబ్బులు పంపిణీలో జాప్యం లేకుండా 48 గంటల్లోనే అకౌంట్లలో జమ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్