దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు జీతాలు, పింఛన్లు ఐదు రోజుల ముందే వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు, పింఛనర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటారని భావిస్తున్నారు.