TG: రాష్ట్రంలో వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మధ్యాహ్నం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో ఈ నిధులను జమ చేస్తారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,482 కోట్లు జమ అవుతాయి. ఎకరాకు రూ. 6,000 చొప్పున ఈ ఆర్థిక సహాయం అందనుంది. కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.