రజినీకాంత్ 'కూలీ' మూవీలోని 'మోనికా' సాంగ్ చాలా పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ప్రతి ఈవెంట్‌లో పూజా హెగ్డే, సౌబిన్ స్టెప్పులే కనిపిస్తున్నాయి. తాజాగా త్రివేండ్రం మెడికల్ కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. అమ్మాయిలు సంప్రదాయ చీరకట్టులో స్టెప్పులేసి అదరగొట్టగా, అబ్బాయిలు షర్ట్-పంచెలో అలరించారు. ప్రస్తుతం వీరి డ్యాన్స్ వీడియో SMలో వైరల్ అవుతోంది.