ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కచేరి రోడ్‌లో వెళ్తున్న లాయర్ వద్ద నుంచి ఒక కోతి రూ.2 లక్షల నగదుతో కూడిన బ్యాగును లాక్కుని పారిపోయింది. సమీపంలోని చెట్టుపైకి ఎక్కి ఆ కోతి నోట్లను కిందకు విసిరేసింది. స్థానికులు కొందరు నోట్లను ఏరుకుని లాయర్‌కు తిరిగిచ్చారు, మరికొందరు తీసుకెళ్లారు. చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి కోతిని భయపెట్టడంతో అది బ్యాగును వదిలేసి వెళ్లిపోయింది. అయితే కొంత నగదు తగ్గినట్లు లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో, సెల్‌ఫోన్లలో రికార్డ్ అయింది.