ఏఐ సాయంతో కొత్త ఔషధాల పరిశోధన వేగవంతం కావడంతో అమెరికాలో ల్యాబ్ కోతులకు డిమాండ్ పెరిగింది. మానవులతో జన్యుపరంగా పోలికలు ఉండే మకాక్ కోతులపై మందుల భద్రత, ప్రభావాన్ని పరీక్షిస్తారు. చైనా ఎగుమతులపై నిషేధం, కంబోడియా నుంచి దిగుమతులపై ఆంక్షలతో కొరత ఏర్పడింది. దీంతో 2019లో సుమారు 3 వేల డాలర్లుగా ఉన్న ఒక్కో కోతి ధర ప్రస్తుతం 20 వేల డాలర్లకు పైగా చేరింది. ఈ నేపథ్యంలో అమెరికాలోనే పెంపక కేంద్రం ఏర్పాటు చేయాలని ‘సేఫర్ హ్యూమన్ మెడిసిన్’ స్టార్టప్ యోచిస్తోంది. రాబోయే 20 ఏళ్లలో 30 వేల మకాక్ కోతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.