ముంబైలోని వడాలా ప్రాంతంలో మరోసారి మోనో రైలు మొరాయించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా సోమవారం ఉదయం మోనో రైలు హఠాత్తుగా నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో ఆగిపోయిన వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. వారిని చెంబూర్ నుంచి వచ్చిన మరో మోనో రైలులో సురక్షితంగా తరలించారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.