తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు

12482చూసినవారు
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింత విస్తరించాయి. జులై 3 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా జులై 3-4 తేదీల్లో ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జులై 4-5 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. జులై 5-8 తేదీల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్