వాయుగుండంగా బలహీనపడిన ‘మొంథా’

54098చూసినవారు
వాయుగుండంగా బలహీనపడిన ‘మొంథా’
మొంథా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. 6 గంటలుగా 12 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాబోయే 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్