మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

87చూసినవారు
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు
మహిళా ఉద్యోగుల కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలసరి (పీరియడ్స్‌) సమయంలో మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐటీ సంస్థలు, మల్టీనేషనల్‌ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ వర్తించనుంది. మహిళా సంక్షేమం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సామాజిక వర్గాలు స్వాగతిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్