కొండగట్టు అంజన్నకు చందనోత్సవం.. 60 ఏళ్ల తరువాత వేడుకలు

0చూసినవారు
కొండగట్టు అంజన్నకు చందనోత్సవం.. 60 ఏళ్ల తరువాత వేడుకలు
TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం నిర్వహించనున్నారు. నవంబర్‌ 16 నుంచి 20 వరకు మూలవిరాట్టుపై పేరుకుపోయిన ఆరు అంగుళాల సింధూరాన్ని అర్చకులు ప్రత్యేక పూజలతో తొలగించనున్నారు. ఈ ఐదు రోజులు స్వామివారి మూలవిరాట్టు దర్శనం ఉండదు. నవంబర్‌ 21 నుంచి 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఉత్సవాల కోసం దేవస్థానం రూ.20 లక్షలు కేటాయించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత పోస్ట్