అమెరికా హెచ్–1బీ వీసా విధానంలో మరోసారి మార్పులు చేర్పులు జరగనున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం, వీసా మినహాయింపుల అర్హతను కఠినతరం చేయడంతో పాటు ఉల్లంఘనలు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ‘రిఫార్మింగ్ ద హెచ్–1బీ నాన్‌ఇమిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదయ్యాయి. డిసెంబర్ 2025లో ఇవి అమల్లోకి రానున్నాయి.