
విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి
దక్షిణ ఇథియోపియాలో మరో ప్రాణాంతకమైన వైరస్ అందరినీ భయపెడుతుంది. ఎబోలా కుటుంబానికి చెందిన మార్బర్గ్ వైరస్ విస్తరిస్తోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదయ్యాయని, అందులో 8 మంది చనిపోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ వైరస్ కారణంగా మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. ఈ వైరస్ సోకితే అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.




