కాఫీని ఉదయం పూట మాత్రమే తాగేవాళ్లలో గుండె జబ్బులతో పాటు భిన్న రకాలుగా ప్రాణహాని తగ్గుతున్నట్లుగా హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు కప్పులు తాగితే ప్రయోజనాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. రోజూ కాఫీని తాగని వారితో పోలిస్తే, రెండు నుంచి మూడు కప్పులు తాగేవారికి హృదయ సంబంధ వ్యాధులు, మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ అధ్యయనంలో పేర్కొంది.