
డ్రైనేజీలో భారీ కొండచిలువ (వీడియో)
AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలో ఉన్న డ్రైనేజీ కాలువ నుంచి రైతులు పొలంలోకి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండచిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.




