
మృత్యువుతో పోరాడుతున్న స్టార్ ప్లేయర్.. పరిస్థితి విషమం
ఒకప్పుడు నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించిన అఫ్గానిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన శరీరంలో తెల్ల రక్తకణాల స్థాయి ప్రమాదకరంగా పడిపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించి, త్వరగా కోలుకోవాలని అభిమానులను ప్రార్థించమని కోరాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




