ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఢిల్లీలో భూములు, ఇళ్లకు 'ప్రాపర్టీ ఆధార్ కార్డ్'!
Aug 01, 2026, 11:08 IST/

ఢిల్లీలో భూములు, ఇళ్లకు 'ప్రాపర్టీ ఆధార్ కార్డ్'!

Aug 01, 2026, 11:08 IST
ఢిల్లీ ప్రభుత్వం ప్రజల గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ తరహాలోనే భూములు, ఇండ్ల గుర్తింపు కోసం కొత్త డిజిటల్ కార్డులను తీసుకురాబోతుంది. 'ఢిల్లీ భూ రికార్డుల బిల్లు-2026' ప్రకారం, ప్రతి ఆస్తికి 'ప్రాపర్టీ ఆధార్ కార్డ్' పేరుతో ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డు జారీ చేయబడుతుంది. డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో భూములు, భవనాలను సర్వే చేసి, కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్‌ను రూపొందిస్తారు. దీనివల్ల భూ సమస్యలు పరిష్కారమై, క్రయవిక్రయాలు సులభతరం అవుతాయని సీఎం రేఖా గుప్తా తెలిపారు. బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది, అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందనుంది.