బంగాళాఖాతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్లు ఎక్కువగా ఎందుకు ఏర్పడతాయో అధికారులు వివరించారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం తర్వాత పసిఫిక్ నుండి వచ్చే అల్పపీడనాలు, అప్పటి సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో తుఫాన్లుగా మారుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల కారణంగానే తుఫాన్లు తరచూ ఇక్కడే తీరం దాటుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల గమనం తుఫాన్ల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు.