విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింహాచలం అడవివరానికి చెందిన ఓ లాడ్జిలో ఉరేసుకొని తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను నీలవతి, గయప్పాంజన్‌గా గుర్తించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.