ఒకే ఇంట్లో తల్లీకొడుకు ఆత్మహత్య!

16చూసినవారు
ఒకే ఇంట్లో తల్లీకొడుకు ఆత్మహత్య!
TG: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలోని కనకదుర్గ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తల్లి కళావతి (45), కొడుకు శివ (20) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్