నాలుగేళ్ల కొడుకుని కొట్టి చంపిన తల్లి అరెస్ట్

38చూసినవారు
నాలుగేళ్ల కొడుకుని కొట్టి చంపిన తల్లి అరెస్ట్
ఉత్తరాఖండ్‌లో అక్టోబర్ 27న దోయివాలా బ్లాక్‌లో నివాసముంటున్న రాహుల్ కుమార్ భార్య ప్రియ తరచుగా తన నాలుగేళ్ల కుమారుడు వివాన్‌ను దౌర్జన్యంగా కొడుతూ ఉండేదట. ఆ రోజు రాహుల్ పనికి వెళ్లిన తర్వాత కూడా బాలుడిని కొట్టి చంపేసింది. అయితే పని ముగించుకొని వచ్చిన రాహుల్ కొడుకు మృతిని తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ప్రియ కోపంతో వివాన్‌ను నేలకేసి నెట్టిందని, అతడు గాయాలవల్ల చనిపోయాడని అంగీకరించింది. దీంతో పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్