పండగ అంటేనే శుచి, శుభ్రత. ఇంటిని, ఒంటిని క్లీన్ చేసుకొని భక్తితో ఫెస్టివల్‌ని జరుపుకుంటారు. అయితే, యూపీలోని మీర్జాపూర్‌లో దీపావళి వేడుకలకు సంబంధించి ఇంటిని శుభ్రం చేసే విషయంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పండగకు ముందు ఇంటిని శుభ్రం చేయమని తల్లి చెప్పినందుకు అలిగిన యువతి సెల్ టవర్‌పై ఎక్కి హల్‌చల్ చేసింది. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను సురక్షితంగా కిందకు దింపారు.