కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని కొట్టిన తల్లి (వీడియో)

26393చూసినవారు
నిత్యం అమ్మాయిలను వేధిస్తూ కొందరు పోకిరీలు పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఇలా తన కుమార్తెను వేధించిన ఓ యువకుడిని బాలిక తల్లి సరైన గుణపాఠం నేర్పింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ ప్రాంతంలో ఓ బాలికను స్థానిక యువకుడు తరచూ వేధిస్తున్నాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. ఇది తెలుసుకున్న బాలిక తల్లి అతడిని చెప్పుతో కొట్టింది. తనను వదిలేయాలని, మరోసారి బాలికతో అసభ్యంగా ప్రవర్తించనని నిందితుడు వేడుకున్నాడు.