ఉదయం పిల్లలు నిద్రలేవకపోవడంతో విసుగు చెందిన ఒక తల్లి వారిని నిద్రలేపడానికి ఏకంగా డోలు, ట్రంపెట్ వాయించే బ్యాండ్‌ను ఇంటికి పిలిపించి నిద్ర లేపింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తల్లిని 'మదర్ ఆఫ్ ది ఇయర్' అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ట్రెండ్ అవుతుంది. కొందరు తల్లిని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు పిల్లలను సపోర్ట్ చేస్తున్నారు.