ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

24028చూసినవారు
ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య
కర్ణాటకలోని కొప్పళ జిల్లా కుకనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బెణకల్‌ గ్రామంలో సోమవారం లక్ష్మి భజంత్రి (30) తన ఇద్దరు పిల్లలు రమేశ్‌ (3), జానవి(2)లను హతమార్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తితో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని, అతని ఒత్తిడిని తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడిందని మృతురాలి తల్లి బసవ్వ ఆరోపించారు. తొలుత పిల్లలను ఉరి తీసి, ఆ తర్వాత లక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్