అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో చైల్డ్ కస్టడీ విషయంలో కోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన తల్లి, తన 4 ఏళ్ల కూతురిని తుపాకీతో కాల్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. కూతురు వివియన్ ప్రాథమిక కస్టడీని తండ్రి ఆరోన్ సవెల్లాకు ఇస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. తల్లి కేవలం పర్యవేక్షణలో మాత్రమే కుమార్తెను చూడాలని ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘోరం జరిగింది. తల్లి సిబెల్లా(35) కోర్టు తీర్పుతో మనోవేదనకు గురై ఈ దారుణానికి పాల్పడిందని సమాచారం.