TG: రెండేళ్ల కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట (M)లో జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. ఖాజాపూర్ గ్రామానికి చెందిన అఖిల (24) భర్త ప్రవీణ్ ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందాడు. దీంతో అఖిల తన కొడుకు రియాన్స్ తో కలిసి నార్సింగి(M) సంకాపూర్ గ్రామంలోని తల్లిగారి ఇంట్లో ఉంటోంది. అయితే సోమవారం అఖిల అత్త ఆమెను ఖాజాపూర్కు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అఖిల కుమారుడితో కలిసి ఉరి వేసుకుందని తెలిపారు.