తల్లి మృతి.. అమ్మ కావాలంటూ కూతురు ఎదురుచూపు

37868చూసినవారు
తల్లి మృతి.. అమ్మ కావాలంటూ కూతురు ఎదురుచూపు
AP: కాకినాడ(D) తాళ్లరేవు(M) చినవలసలకు చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి (31) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆస్పత్రిలో ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మల్లేశ్వరికి తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ప్రస్తుతం కూతురు గోవలక్ష్మి ఒకటో తరగతి చదువుతోంది. అమ్మ ఎప్పుడు వస్తుందని గోవలక్ష్మి తండ్రిని అడుగుతుంటే.. అమ్మలేదని, ఇక రాదని చెప్పలేక కన్నీరుమున్నీరవుతున్నారు.
Job Suitcase

Jobs near you