జోల పాడుతూ తల్లి కునుకు.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

90చూసినవారు
జోల పాడుతూ తల్లి కునుకు.. నీటి సంపులో పడి చిన్నారి మృతి
TG: ఓ చిన్నారి పాక్కుంటూ వెళ్లి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ(D) గుర్రంపోడు(M) కొనాయిగూడెంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఒరుసు శ్రీను- మమత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇవాళ ఉదయం తల్లి మమత కొడుకు స్టాలిన్ (11 నెలలు) కు జోలపాడుతూ పడుకోబెట్టింది. ఆమె కూడా కొద్దిసేపు ఆమె  కునుకు తీసింది. ఈ క్రమంలో చిన్నారి పాక్కుంటూ బయటికి వచ్చి ఇంటి ఆవరణలో ఉన్న నీళ్ల సంపు వద్ద ఆడుకుంటూ జారి అందులో పడిపోయాడు. కొద్దిసేపటికి తల్లి లేచి వెతకగా సంపులో తేలుతూ కుమారుడి మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్